DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలో కంటి వెలుగు కార్య క్రమం కోసం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలో ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరింస్తున్నట్లు కలెక్టర్ భారతి హోళ్లికేరి ఒక ప్రకటనలో తెలిపారు. పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్ పోస్టు కోసం డీవోఏ / డిప్లొ మా ఇన్ ఆప్తోమెట్రిలో రెండేళ్ల డిప్లొమా తోపాటు తెలంగాణ రాష్ట్ర పారామెడికల్ బోర్డు లో రిజిస్ట్రేషన్ ఉన్నవారు అర్హులని... 40 పోస్టులు ఖాళీగా ఉండగా నెలకు రూ.30 వేల వేతనం చెల్లిస్తారని తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాల తో డిసెంబర్ 5 తారీఖున ఉదయం 10:30 నిమిషాలకు మంచిర్యాల జిల్లాలోని వైద్యఆరోగ్య శాఖలో సంప్రదించాలని సూచించారు.
