హైదరాబాద్ పట్టణంలోని పంజాగుట్ట లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) లో కాంట్రాక్టు ప్రాతిపదికన 200 స్టాప్ నర్స్ ఉద్యోగాల నియామకం నిమిత్తం అర్హులైన తెలంగాణ రాష్ట్ర అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. రూ.32,682/-ల స్థిర వేతనంతో కాంట్రాక్టు 31.03.2023 వరకు ఉంటుంది. దరఖాస్తు తాజా సమాచారం కొరకు www.nims.edu.in ను అభ్యర్థులు దర్శించవలెను. ఆన్లైన్ దరఖాస్తు దాఖలుకు చివరి తేది 06.09.2022. ఆన్లైన్ దరఖాస్తు యొక్క హార్డ్ కాపీకి అవసరమైన మద్దతు డాక్యుమెంట్లను జతచేసి, 10.09.2022, సా.5.00 గం. లోపు చేరేలా ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ ఆఫీస్, 2వ అంతస్తు ఓల్డ్ ఒపిడి బ్లాక్, నిమ్స్ పంజాగుట్ట, హైదరాబాద్-500082కు స్వయంగా లేదా పోస్ట్ ద్వారా ప్రాధాన్యంగా ఇండియన్ పోస్టల్ సర్వీస్ ద్వారా దాఖలు చేయవలెను.
.jpeg)